Skip to main content

సంత్ రవిదాస్ మహరాజ్ 650వ జయంతి ఉత్సవాలు – విజయవాడలో ఘన స్వాగతం

 సంత్ రవిదాస్ మహరాజ్ 650వ జయంతి ఉత్సవాలు – విజయవాడలో ఘన స్వాగతం


సంత్ రవిదాస్ మహరాజ్ 650వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వారణాసి నుంచి తీసుకొచ్చిన పవిత్ర కలశాలకు విజయవాడలో ఘన స్వాగతం పలికారు.

సంత్ రవిదాస్ మహరాజ్ 650వ జయంతి పవిత్ర కలశాలు విజయవాడ
PVN మాధవ్ – సంత్ రవిదాస్ 650వ జయంతి



ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారు, శైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీ శివస్వామి గారు పాల్గొన్నారు.

సంత్ రవిదాస్ మహరాజ్ 650వ జయంతి నృత్య కార్యక్రమం విజయవాడ
సంత్ రవిదాస్ మహరాజ్ 650వ జయంతి నృత్య కార్యక్రమం విజయవాడ బీజేపీ ఎస్సీ మోర్చా president panathala suresh– సంత్ రవిదాస్ జయంతి




ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సంత్ రవిదాస్ మహరాజ్ ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, సమాజంలో సమరసత భావాన్ని మరింత బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.



నృత్య కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ





సంత్ రవిదాస్ మహరాజ్ 650వ జయంతి కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా president panathala suresh garu
BJP SC MORCHA ANDHRA PRADESH president panathala suresh
సంత్ రవిదాస్ మహరాజ్ 650వ జయంతి కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు


ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చారు. నృత్య ప్రదర్శనలను వీక్షించిన నాయకులు, కార్యకర్తలు కళాకారులను అభినందించారు.


“సమరసతే సమాజ బలం… సంత్ రవిదాస్ మహరాజ్ ఆశయాలే మన స్ఫూర్తి” అనే సందేశంతో కార్యక్రమం కొనసాగింది.


ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులతో పాటు ఎస్సీ మోర్చా నాయకులు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


సంత్ రవిదాస్ మహరాజ్ బోధించిన సమానత్వం, సామాజిక సమరసత, మానవతా విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత ప్రేరణగా నిలుస్తాయని నాయకులు తెలిపారు.


#SantRavidasMaharaj #RavidasJayanti650 #Samrasata #PVNMadhav #BJPAndhraPradesh #BJPSCMorchaAP #Vijayawada #SamrasataSankalpAbhiyan

Comments

Popular posts from this blog

బీజేపీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో కీలక నియామకాలు

 బీజేపీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో కీలక నియామకాలు విజయవాడ | ఆగస్టు 27, 2026 BJP SC Morcha AP State Spokespersons Appointments 2026 భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీలో నూతనంగా రాష్ట్ర అధికార ప్రతినిధుల నియామకాలను ప్రకటించారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఇద్దరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియామకం 1. శ్రీ చికిలే తరుణ్ 📍 డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా 2. శ్రీమతి పీతల అంజలి రాజానాల 📍 అన్నమయ్య జిల్లా ఈ నియామకాలు 2026 ఆగస్టు 27న ప్రకటించబడ్డాయి. ఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీకి అధికార ప్రతినిధులుగా నూతన బాధ్యతలు స్వీకరించిన శ్రీ చికిలే తరుణ్, శ్రీమతి పీతల అంజలి రాజానాల ప్రజా సమస్యలను పార్టీ వేదికగా సమర్థవంతంగా వినిపిస్తూ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు మరియు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు. నూతనంగా నియమితులైన రాష్ట్ర అధికార ప్రతినిధులకు బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు మరియు శ్ర...

విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు – ఎస్సీ మోర్చా కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన నితిన్ నబిన్

 విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు – ఎస్సీ మోర్చా కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన నితిన్ నబిన్, సంతోష్ బి.ఎల్. విశాఖపట్నం: విశాఖపట్నంలో నిర్వహించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారిని బీజేపీ ఎస్సీ మోర్చా – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పానతల సురేష్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ గారితో పానతల సురేష్ గారు ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా – ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన వివిధ కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారు, జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ సంతోష్  బి.ఎల్. జీ పరిశీలించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ గారితో పానతల సురేష్ గారు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సామాజిక, సేవా, ప్రజా చైతన్య కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను వారు ఆసక్తిగా పరిశీలించారు. కార్యక్రమాల వివరాలను శ్రీ పానతల సురేష్ గారు వారికి వివరించారు. నితిన్ నబిన్, సంతోష్ బి.ఎల్. గారితో పా...

తిరుపతిలో BJP ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదాధికారుల సమావేశం – పార్టీ బలోపేతానికి కీలక చర్చలు

 తిరుపతిలో BJP ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదాధికారుల సమావేశం – పార్టీ బలోపేతానికి కీలక చర్చలు తిరుపతిలోని లెమన్ ట్రీ హోటల్‌లో జరిగిన BJP Andhra Pradesh రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ పాల్గొన్నారు. ఈ సమావేశం రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను విస్తరించడం, ప్రజలకు మరింత చేరువ కావడం వంటి అంశాలపై దృష్టి సారించింది. ఈ కార్యక్రమంలో జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ శివ ప్రకాశ్ జి, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ నూకల గారు పాల్గొని పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, బూత్ స్థాయి బలోపేతం, సభ్యత్వ విస్తరణ, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, రాబోయే రాజకీయ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పనతల సురేష్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లేందుకు కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించి, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ...