పోరాటాల పునాదులపై ప్రజా నాయకుడిగా పనతల సురేష్ ప్రస్థానం నాయకుడు పుట్టుకతో రాడు.. ప్రజా పోరాటాల స్ఫూర్తితో ఉద్భవిస్తాడు. ఉద్యమాల అగ్నిపరీక్షలో నిలబడి గెలుస్తాడు. ఈ మాటలకు ప్రతిరూపంగా విద్యార్థి ఉద్యమాల నుంచి తన ప్రజా ప్రస్థానాన్ని ప్రారంభించి, నేడు దళిత, బహుజన వర్గాల కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకుడిగా ఎదిగిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పనతల సురేష్ గారు. మట్టిబిడ్డగా మొదలైన ప్రస్థానం తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, పొందలూరుకు చెందిన పనతల రామయ్య, జయమ్మ దంపతుల ప్రథమ కుమారుడిగా పనతల సురేష్ గారు జన్మించారు. సామాజిక స్పృహతో పాటు ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన MBA, జర్నలిజంలో మాస్టర్స్ పూర్తి చేశారు. విద్యను కేవలం వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే శక్తిగా భావించి ఉద్యమ బాట పట్టారు. విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ స్థాయి వరకు 2002 నుంచి 2018 వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో ఒక సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం జాతీయ స్థాయి బాధ్యతలు చేపట్టే స్థాయికి చేరుకుంది. రాయలసీమ అభివృద్ధి కోసం ఆమరణ ...
🇮🇳 25 ఏళ్ల ప్రజాసేవా సంకల్ప అభియాన్ – పోస్టర్, లోగో ఆవిష్కరణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని “25 సంవత్సరాల ప్రజా సేవా సంకల్ప అభియాన్” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, లోగోను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పనతాల సురేష్ గారు మాట్లాడుతూ, మోదీ గారి 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 🟠 30 రోజుల్లో 10 లక్షల మందిని కలుసుకునే లక్ష్యం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు 30 రోజుల పాటు బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంబంధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుసుకుని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్నారు. 🟠 సుపరిపాలన – అభివృద్ధి – సంక్షేమం ప్రధాన...