విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు – ఎస్సీ మోర్చా కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన నితిన్ నబిన్

 విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు – ఎస్సీ మోర్చా కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన నితిన్ నబిన్, సంతోష్ బి.ఎల్.


విశాఖపట్నం: విశాఖపట్నంలో నిర్వహించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారిని బీజేపీ ఎస్సీ మోర్చా – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పానతల సురేష్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ గారితో పానతల సురేష్ గారు
బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ గారితో పానతల సురేష్ గారు



ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా – ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన వివిధ కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారు, జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ సంతోష్  బి.ఎల్. జీ పరిశీలించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ గారితో పానతల సురేష్ గారు
బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ గారితో పానతల సురేష్ గారు



ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సామాజిక, సేవా, ప్రజా చైతన్య కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను వారు ఆసక్తిగా పరిశీలించారు. కార్యక్రమాల వివరాలను శ్రీ పానతల సురేష్ గారు వారికి వివరించారు.

నితిన్ నబిన్, సంతోష్ బి.ఎల్. గారితో పానతల సురేష్ గారు
నితిన్ నబిన్, సంతోష్ బి.ఎల్. గారితో పానతల సురేష్ గారు



ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను నాయకులు అభినందించడం కార్యకర్తలకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించింది. భవిష్యత్తులో మరింత విస్తృతంగా ప్రజా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.


ఎస్సీ మోర్చాలో వారు ప్రతీ జిల్లాలో అంబేడ్కర్ గారికి సంబంధించి చాలా పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు.







Comments

Popular posts from this blog

తిరుపతిలో BJP ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదాధికారుల సమావేశం – పార్టీ బలోపేతానికి కీలక చర్చలు

సంత్ రవిదాస్ మహరాజ్ 650వ జయంతి ఉత్సవాలు – విజయవాడలో ఘన స్వాగతం